Thu Mar 19 2026 09:47:49 GMT+0530 (India Standard Time)
Vinesh Phogat : నేడు తేలనున్న వినేశ్ ఫొగాట్ మెడల్ వ్యవహారం
భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కు మెడల్ పై నేడు స్పష్టత రానుంది. ఈరోజు కోర్టు తీర్పు చెప్పనుంది

భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కు మెడల్ పై నేడు స్పష్టత రానుంది. ఈరోజు కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తీర్పు చెప్పనుంది. వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించే దశలో ఆమె అనర్హత వేటు పడింది. ఉండాల్సిన బరువు కంటే వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది.
న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో...
అయితే దీనిపై వినేశ్ ఫొగాట్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాను సెమీస్ చేరిన రోజు ఉండాల్సిన బరువే ఉన్నందున తనకు రజిత పతకం అయినా ఇవ్వాలని ఆమె పిటీషన్ లో పేర్కొన్నారు. దీనిపై నేడు కోర్టు తీర్పు నివ్వడంతో సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తుంది. వినేశ్ ఫొగాట్ కు అనుకూలంగా తీర్పు వస్తే ఆమెకు రజిత పతకం వస్తుంది. భారత్ సాధించిన పతకాల్లో మరొకటి యాడ్ అవుతుంది.
Next Story

